తెలంగాణ

telangana

ETV Bharat / state

'హరితహారాన్ని పండగలా చేద్దాం... రోడ్లన్నీ పచ్చదనంతో నింపేద్దాం' - hyderabad latest news

రోడ్లకిరువైపులా ఆహ్లాదకరమైన మొక్కలు ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎర్రమంజిల్​లోని ఆర్​అండ్​బీ కార్యాలయంలో హరితహారంపై మంత్రి సమీక్షించారు.

minister vemula prasanth reddy review meeting
హరితహారంపై ఆర్​అండ్​బీ అధికారులతో మంత్రి వేముల సమీక్ష

By

Published : Jun 23, 2020, 5:37 PM IST

హరితహారంలో భాగంగా ఆర్​అండ్​బీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్​అండ్​బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే హరితహారం కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారులపై హైవే నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్​అండ్​బీ ఆధీనంలోని నేషనల్ హైవేలపై 25 నర్సరీల స్థలాలు గుర్తించాలని... వాటికి హైవే నర్సరీలుగా నామకరణం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో 800 కిలోమీటర్ల మేర రోడ్లకిరువైపులా, సెంట్రల్ మీడియంలో ఈ సారి హరితహారం కార్యక్రమంలో 3,30,000 మొక్కలు నాటి, వాటిని సంరక్షించేందుకు పూర్తి బాధ్యత తీసుకుంటామని ఎన్​హెచ్​ఏఐ తెలంగాణ రీజినల్ అధికారి కృష్ణ ప్రసాద్ మంత్రికి వివరించారు. తమ శాఖ ఆధీనంలో ఉన్న 20 అతిథి గృహల్లో నర్సరీలు పెంచాలని అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లలో నర్సరీలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖ​, అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ హరితహారం కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా చూడాలని తెలిపారు. ఆయా జిల్లాలో ఆర్అండ్​బీఎస్​ఈలు ఆ బాధ్యతను తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:నర్సాపూర్​ ఉద్యానవనం ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి హరీశ్

ABOUT THE AUTHOR

...view details