తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజస్థాన్​ గనుల్లో మంత్రి ప్రశాంత్​ రెడ్డి.. ఎందుకంటే..? - తెలంగాణ వార్తలు

రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డి రాజస్థాన్​లో పర్యటించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి కావాల్సిన రాళ్ల కోసం శర్మతురా డాంగ్ ప్రాంతంలోని గనులను సందర్శించారు. తెలుపు, ఎరుపు రాళ్ల కోసం దాదాపు అరడజను గనుల్లో తిరిగారు.

r&b minister prashanth reddy tour in rajastan
రాజస్థాన్​లో పర్యటించిన రోడ్లు, భవనాల శాఖ మంత్ర ప్రశాంత్​ రెడ్డి

By

Published : Feb 20, 2021, 8:42 PM IST

రాజస్థాన్​లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డి పర్యటించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి కావాల్సిన రాళ్ల కోసం శర్మతురా డాంగ్ ప్రాంతంలోని గనులను సందర్శించారు. తెలుపు, ఎరుపు రాళ్ల కోసం అరడజను గనుల్లో తిరిగారు. హిరామాన్ డేడ్, వైట్, హిరాపురాలోని ఎర్ర గనులలో, మన్పురా మైనింగ్ ప్రాంతంలో రాళ్లను పరిశీలించారు.

కొత్త సచివాలయం నిర్మాణంలో ధౌల్‌పూర్ జిల్లాకు చెందిన ఎరుపు, తెలుపు రాయిని ఉపయోగిస్తామని తెలిపారు. ధౌల్‌పూర్ జిల్లాలో రాళ్ల నాణ్యత బాగుందని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా వాస్తు ప్రకారం సచివాలయం నిర్మిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details