నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల
శ్రీ తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేత ప్రవేశ దర్శనం టికెట్లను ఈ రోజు విడుదల చేయనుంది తితిదే. ఈ నెల 22, 23, 24 తేదీలకు సంబంధించి టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల
రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్చేసుకోవాలని తితిదే సూచించింది.
ఇదీ చదవండి: నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!