హైదరాబాద్లోని మౌలాలి చౌరస్తా వద్ద ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. షాదుల్లానగర్ నివాసి మహ్మద్ అలీ కారులో రాంగ్రూట్లో వచ్చి జాఫర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాఫిక్ స్తంభించింది. నన్నే ప్రశ్నిస్తావా అంటూ అలీ రెచ్చిపోయాడు. జాఫర్ కుడిచేతి ఉంగరపు వేలిని కొరికి ఉమ్మేశాడు.బాధితుని ఫిర్యాదుతో నిందితుడ్ని పోలీసులను అరెస్టు చేశారు. బాధితుడు వైద్యుడిని సంప్రదించాడు. కానీ వేలు అతికించడం కుదరదని చెప్పటంతో కుంగిపోయాడు. తన వేలు కొరికేసిన అలీని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు.
ప్రశ్నిస్తే 'వేలు' కట్ - hyd
రాంగ్రూట్లో వచ్చావని ప్రశ్నిస్తే చేతి వేలిని కొరికేశాడు. వేలు ఊడిపోయి బాధితుడు లబోదిబోమన్నాడు. ఈ ఘటన హైదరాబాద్లో కలకలం సృష్టించింది.
ప్రశ్నిస్తే చేతి వేలిని కొరికేశాడు