తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీకి వెళ్లిన ఆరుగురు కింగ్​ కోఠి వాసులు.. ఒకరికి కరోనా పాజిటివ్​

కింగ్ ​కోఠి పరదా గ్రేట్​ ప్రాంతంలోని ఆరుగురు వ్యక్తులు దిల్లీకి వెళ్లి ఈ మార్చి 18న హైదరాబాద్​ తిరిగి వచ్చారు. వీరిని పరీక్షంచగా ఒకరికి కరోనా పాజిటివ్​ అని తేలింది. ఈ బాధితుడి ఉమ్మడి కుటుంబం. మొత్తం 46 మంది కలిసి నివసిస్తున్నారు. వారందరికీ ఇంట్లోనే పరీక్షలు నిర్వహించి.. క్వారంటైన్​ ముద్ర వేశారు.

దిల్లీకి వెళ్లిన ఆరుగురు కింగ్​ కోఠి వాసులు.. ఒకరికి కరోనా పాజిటివ్​
దిల్లీకి వెళ్లిన ఆరుగురు కింగ్​ కోఠి వాసులు.. ఒకరికి కరోనా పాజిటివ్​

By

Published : Apr 5, 2020, 10:21 AM IST

రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దిల్లీ మర్కజ్​లో జరిగిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న సమయంలో హైదరాబాద్​ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కోఠి పరదా గెట్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రాంతం నుంచి మస్తాన్ ఉస్మాన్ అలీ, మునసర్ జబ్రీ, అక్రమ్, నజిమ్, షాబాజ్, ఎస్.కె సౌద్​లు మార్చ్ 12న విమానంలో హస్తినకు వెళ్లారు. తిరిగి 18న నగరానికి వచ్చారు. అయితే నాలుగు రోజుల క్రితం ఈ ఆరుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా... శనివారం మధ్యాహ్నం మస్తాన్ ఉస్మాన్ అలీకి కరోనా పాజిటివ్​గా నిర్ధరణైంది. మిగిలిన ఐదుగురి ఫలితాలు రావాల్సి ఉంది.

దిల్లీకి వెళ్లిన ఆరుగురు కింగ్​ కోఠి వాసులు.. ఒకరికి కరోనా పాజిటివ్​

అయితే పాజిటివ్ వచ్చిన మస్తాన్ ఉస్మాన్ అలీది ఉమ్మడి కుటుంబం. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకే ఇంట్లో 46 మంది నివాసం ఉంటున్నారు. ఇతనికి కరోనా పాజిటివ్ రావడం వల్ల ఈ 46 మంది కుటుంబ సభ్యులను గాంధీ వైద్యురాలు దీప్తి ప్రియాంక.. ఇంట్లోనే టెస్టులు నిర్వహించారు. మిగిలిన ఐదుగురి ఇళ్లల్లో కూడా ఒక్కొక్కరి ఇంట్లో 20 మందికి పైగా నివసిస్తున్నారు. ఈ 46 మంది నమునాలను సేకరించాక.. వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ ముద్ర వేసి ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించినట్లు జీహెచ్ఎంసి అసిస్టెంట్ మెడికల్ వైద్యాధికారి హేమలత తెలిపారు.

ఇదీ చూడండి:మాస్కు​ ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

ABOUT THE AUTHOR

...view details