ప్రపంచంలో అతిపెద్ద సూపర్ కంప్యూటర్... పది వేల సంవత్సరాలు పనిచేస్తే అయ్యే టాస్క్‌ను తమ కంప్యూటర్ కేవలం 3 నిమిషాల 20 సెకన్లలో చేసిందని గూగుల్ ప్రకటించింది. నేచర్ అనే ఒక సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమైన పేపర్లో ఇది తమ సంస్థలో ఓ కీలక మైలు రాయిగా వర్ణించింది. ఇలాంటి పనులు చేసే వాటిని క్వాంటమ్ కంప్యూటర్లు అంటారు. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్‌లో క్వాంటమ్ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోందని ఏఆర్సీఐ డైరెక్టర్ డా. జీ. పద్మనాభం తెలిపారు. వేల కోట్ల రూపాయల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును దేశంలో ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని తెలిపారు. ఇప్పటికైతే... క్వాంటమ్ మెకానిక్స్‌పై సవివరమైన ప్రణాళిక తయారవుతోందన్నారు. రిపోర్టు పూర్తి కాగానే... వెంటనే ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందని పద్మనాభం తెలిపారు.
క్వాంటమ్ కంప్యూటర్ల పరిశోధనకు వేదికవుతోన్న హైదరాబాద్
హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మకమైన ఐటీ ప్రాజెక్ట్‌కు వేదికైంది. సూపర్ కంప్యూటర్లు వేల సంవత్సరాలు చేసే పనిని కేవలం నిమిషాల్లో చేసే క్వాంటమ్ కంప్యూటర్లపై నగరంలోని ఏఆర్సీలో పరిశోధన జరుగుతోంది. ప్రస్తుతం సైద్ధాంతిక స్థాయిలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే కార్యరూపం దాల్చనుందని అధికారులు చెబుతున్నారు.
QUANTUM COMPUTING PROJECT IN HYDERABAD ARCI
Last Updated : Oct 26, 2019, 10:11 PM IST