పీవీ నరసింహారావు యావత్ భారతదేశం గర్వించదగిన రాజనీతిజ్ఞుడని జర్మనీలోని ప్రవాస భారతీయులు కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జర్మనీలోని తెరాస విభాగం ఆధ్వర్యంలో మ్యూనిచ్ సిటీలో దివంగత ప్రధాని పీవీ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ దేశానికి చేసిన సేవలను ప్రవాస భారతీయులు కొనియాడారు.
జర్మనీలోని మ్యూనిచ్ సిటీలో 'పీవీ' శతజయంతి వేడుకలు - జర్మనీలో పి వి శత జయంతి న్యూస్
దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు సేవలు భారతదేశ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేనివని జర్మనీలోని ప్రవాస భారతీయులు కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పీవీ శతజయంతి వేడుకలను జర్మనీలోని తెరాస విభాగం ఆధ్వర్యంలో మ్యూనిచ్ సిటీలో ఘనంగా నిర్వహించారు.
ప్రధానంగా సంపూర్ణ బలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ... ముందు చూపుతో చేసిన ఆర్థిక సంస్కరణలను స్మరించుకొని నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్న పురస్కారానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా వాసులైన అరవింద్ గుంత, నరేష్ మేసినేని, శ్రీనివాస్ ఉమ్మెంతుల, గిరీష్ బండి, వినయ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి :పీవీ కృషితోనే ఉత్తర తెలంగాణ అభివృద్ధి: హరీశ్
TAGGED:
Pv sathayajanthi