తెలంగాణ

telangana

ETV Bharat / state

'కౌసల్య కృష్ణమూర్తి' ప్రేరణ కలిగించే చిత్రం - 'కౌసల్య కృష్ణమూర్తి'

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ సాధించిన తర్వాత.... విరామం లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న పీవీ సింధు... సరదాగా కౌసల్య కృష్ణమూర్తి చిత్రం వీక్షించింది. ఆడ పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహం ఇస్తే ఎంతటి విజయాన్ని అయినా సాధిస్తారని సినిమాలో చక్కగా చూపించారని ప్రశంసించారు.

కౌసల్య కృష్ణమూర్తి ప్రేరణ కల్గించే చిత్రం :పీవీ సింధు

By

Published : Sep 1, 2019, 6:58 AM IST

Updated : Sep 1, 2019, 8:22 AM IST

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పీవీ సింధు హైదరాబాద్​లోని రామానాయుడు స్టూడియోలో 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం వీక్షించింది. కోచ్‌ గోపీచంద్‌, చాముండితో కలిసి ఆమె చిత్రం చూశారు. అన్నం పెట్టే రైతులను చిన్న చూపు చూడవద్దని ఈ చిత్రంలో చూపడం తననెంతో ఆకట్టుకుందని సింధు తెలిపారు. ప్రతిభ గల యువతులను ప్రోత్సహిస్తే ఎలా రాణిస్తారో చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లల్లో ఉన్న ప్రతిభ గుర్తించి ప్రోత్సహిస్తే ఆయా రంగాల్లో వారు రాణిస్తారని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నారని సింధు చెప్పారు.

కౌసల్య కృష్ణమూర్తి ప్రేరణ కల్గించే చిత్రం :పీవీ సింధు
Last Updated : Sep 1, 2019, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details