తెలంగాణ

telangana

ETV Bharat / state

'పీవీ శత జయంతి ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహిస్తాం' - కే.కేశవరావు తాజా వార్తలు

రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు నివాసంలో మాజీ ప్రధాని పీవీ. నరసింహరావు శత జయంతి నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు. పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

PV narasimha rao Jayanti celebrations are held on a large scale
'పీవీ శత జయంతి ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహిస్తాం'

By

Published : Jun 18, 2020, 5:13 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎంపీ కె.కేశవరావు నివాసంలో మాజీ ప్రధాని పీవీ. నరసింహరావు శత జయంతి నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. కేశవరావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఈటల, శ్రీనివాస్‌గౌడ్, మాజీ సీఎస్ రాజీవ్​శర్మ, పీవీ కుమారుడు ప్రభాకర్​రావు, కుమార్తె వాణి దేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మామిడి హరికృష్ణ, దేవులపల్లి ప్రభాకర్​ తదితరులు పాల్గొన్నారు.

పీవీ నరసింహారావు శత జయంతి నిర్వహణ కమిటీని సీఎం ఏర్పాటు చేశారని ఎంపీ కేశవరావు పేర్కొన్నారు. జయంతి ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహిస్తామన్నారు. జూన్ 28న నెక్లెస్​రోడ్డులోని జ్ఞానభూమిలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. పీవీ పేరు మీద మ్యూజియం, ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేయాలని కమిటీలో చర్చించామన్నారు. జాతీయ స్థాయిలో సెమినార్ నిర్వహించాలనే అభిప్రాయం వచ్చిందని తెలిపారు.

పీవీ స్వగ్రామమైన వంగరను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే అంశంపైనా చర్చించినట్లు ఎంపీ వివరించారు. శత జయంతి ఉత్సవ కార్యక్రమాలను రూపకల్పన చేసి ముఖ్యమంత్రికి అందజేస్తామని అన్నారు. పీవీ జయంతి రోజున ముఖ్యమంత్రి కార్యక్రమ వివరాలను విడుదల చేస్తారని తెలిపారు.

ఇదీచూడండి: సెలవిక: బరువెక్కిన జన హృదయం.. అడుగడుగునా పూలవర్షం

ABOUT THE AUTHOR

...view details