హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉన్న పీవీ జ్ఞానభూమి వద్ద పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభావేదిక, బారికేడ్లు, విద్యుత్ దీపాలు సహా ఇతరత్రా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28న పీవీ వందో జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు - పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు
మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉన్న పీవీ జ్ఞానభూమి వద్ద ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు
సీఎంతోపాటు మంత్రులు, ప్రముఖులు, పీవీ కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. పీవీకి అంజలి ఘటిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు, భజనలు, కీర్తనలు ఉంటాయి.
ఇదీ చదవండి:వారికి స్మార్ట్ఫోన్లే లేవ్- మరి ఆన్లైన్లో చదువెలా?