పీవీ శతజయంతి ఉత్సవాలు ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని... పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వేడుకలకు సంబంధించి శతజయంతి ఉత్సవ కమిటీ గాంధీభవన్‌లో సమావేశమైంది. మొదటిరోజు ఆర్థిక సంస్కరణలపై పీవీ చేసిన ప్రసంగాలను ప్రసారం చేయనున్నట్లు ఉత్తమ్ తెలిపారు.
పీవీ నరహింహారావు వందశాతం కాంగ్రెస్ వాదే: ఉత్తమ్ - ఉత్తమ్ కుమార్ స్పందన
పీవీ శతజయంతి ఉత్సవాలకు సంబంధించి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవ కమిటీ గాంధీభవన్‌లో సమావేశమైంది. వేడుకలకు సంబంధించిన ప్రణాళికలపై... కమిటీకి ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు. పీవీ వందశాతం కాంగ్రెస్ వాదేనని పునరుద్ఘాటించారు.
![పీవీ నరహింహారావు వందశాతం కాంగ్రెస్ వాదే: ఉత్తమ్ pv-committee-meeting-at-gandhibhavan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8086360-thumbnail-3x2-uttam.jpg)
'మొదటి రోజు పీవీ ప్రసంగాలను ప్రసారం చేస్తాం'
ఇందిరా భవన్‌లో ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి ప్రసంగాలు వినేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జూమ్ యాప్ ద్వారా 1000 మంది వేడుకల్లో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ మంత్రి చిదంబరం, జైరాం రమేష్‌లు జూమ్ ద్వారా మాట్లాడతారని ఉత్తమ్ వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ రేవంత్ రెడ్డి, చైర్మన్ గీతారెడ్డి, కన్వీనర్ మహేష్ గౌడ్, ఎమ్యెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Jul 19, 2020, 5:30 PM IST