మాజీ ప్రధాన మంత్రి, స్వర్గీయ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ గాంధీభవన్‌లో ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యే వేడుకల్లో.... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఉత్సవ కమిటీ ఛైర్మన్ గీతారెడ్డి, ఇతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొంటారు.
కొవిడ్ నిబంధనలను పాటిస్తూ... ఇందిరాభవన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైరస్ దృష్ట్యా కార్యక్రమం అంతా జూమ్ యాప్ ద్వారా వర్చువల్ సమావేశం జరుగుతుంది. ఏడాది పాటు నిర్వహించనున్న పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్ గీతారెడ్డి తదితరులు పీవీ ఉత్సవాల టీజర్‌ను ప్రారంభించారు.