తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు శుక్రవారం గాంధీభవన్‌లో మొదలయ్యాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీవీ సోదరుడు మనోహర్ రావు, పీవీ శత జయంతి కమిటీ ఛైర్మన్ గీతారెడ్డి, గౌరవ ఛైర్మన్ వి.హనుమంత రావు, వైస్ ఛైర్మన్ శ్రీధర్ బాబు, కన్వీనర్ మహేశ్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పీవీ మహోన్నతమైన వ్యక్తి : మన్మోహన్ సింగ్ - former pm manmhohan sing latest news
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న మహోన్నత వ్యక్తి స్వర్గీయ పీవీ నర్సింహారావు అని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. పీవీ నిబద్దతతో కూడిన కాంగ్రెస్ నేతని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన సందేశంలో కొనియాడారు. టీపీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పీవీ శత జయంతి ఉత్సలాల్లో ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న మహోన్నత వ్యక్తి స్వర్గీయ పీవీ నర్సింహారావు అని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పంపిన సందేశాలను ఉత్తమ్ చదివి వినిపించారు. పీవీ నర్సింహారావు నిబద్దతతో కూడిన కాంగ్రెస్ నేతని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన సందేశంలో కొనియాడారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, జైరాం రమేశ్‌లు జూమ్ యాప్ ద్వారా తమ సందేశాలను వినిపించారు. తనను రాజకీయాల్లో ఎంతో ప్రోత్సహించిన వ్యక్తి పీవీ అని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తన సందేశంలో గుర్తు చేసుకున్నారు. యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న తనను ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ప్రోత్సహించారన్నారు. ఈరోజు పీవీ ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన రోజని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలను సైతం సహనంతో స్వీకరించి.. తనదైన శైలిలో సమాధానం ఇచ్చేవారని, పీవీ ప్రధానిగా ఉన్న సమయంలోనే నూతన పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు.