తెలంగాణ

telangana

ETV Bharat / state

Lockdown: సినీ కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి - లాక్​డౌన్​తో కష్టాల్లో సినీ కార్మికలు

సినీ కార్మికులను లాక్​డౌన్​ కష్టాల నుంచి గట్టెక్కించాలని సంఘ సేవకుడు పుట్టా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, సినీ పెద్దలను విజ్ఞప్తి చేశారు.

cine artists problems in lockdown
లాక్​డౌన్​తో కష్టాల్లో సినీ కార్మికులు

By

Published : May 27, 2021, 11:48 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకోవాలని సంఘ సేవకుడు పుట్టా రామకృష్ణ.. రాష్ట్ర ప్రభుత్వానికి, సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమలో దాదాపు 20 వేల మందికి పైగా కార్మికులు దినసరి వేతనంతో పని చేస్తున్నారని రామకృష్ణ అన్నారు. ఇప్పుడు వారంతా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్​ చిరంజీవిని కలిసేందుకు యత్నించినా.. కరోనా కారణంగా కలవలేకపోయామని చెప్పారు.

దాతల సహాయంతో కొంత వరకు కార్మికులకు సహాయం అందించామని.. కానీ పూర్తిగా న్యాయం చేయాలంటే సినీ పెద్దలు ముందుకు వచ్చినప్పుడే సాధ్యమవుతుందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. కరోనా తొలిదశ సమయంలో చిరంజీవి ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేసి కార్మికులకు సహాయం అందించారని.. ఇప్పుడు కూడా అదే విధంగా సహాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:Etela: 'కొత్త పార్టీ పరిష్కారం కాదు.. అందరం ఏకమవుదాం'

ABOUT THE AUTHOR

...view details