హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంఘ సేవకుడు, స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు పుట్టా రామకృష్ణ ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అలాగే నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయాన్ని అందజేస్తూ... తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న ఓ సినీ కార్మికుని వైద్య ఖర్చుల నిమిత్తం 5 వేల రూపాయలను ఇచ్చారు.
నిరుపేదలకు అండగా నిలుస్తున్న పుట్టా రామకృష్ణ - పేదలకు ఆర్థిక సాయం అందజేసిన పుట్టా రామకృష్ణ
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేద ప్రజలకు స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు పుట్టా రామకృష్ణ అండగా నిలుస్తున్నారు. భాగ్యనగరంలో ఆకలితో అలమటించే వారికి ఆహరంతో పాటు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు.
నిరుపేదలకు అండగా నిలుస్తున్న పుట్టా రామకృష్ణ
అలాగే రహ్మత్నగర్లో అంజలి నాట్యాలయ పిల్లలకు ఉచిత భోజన వసతి కల్పించారు. ప్రతిరోజు వారికి ఆహారం అందించాలనే ఉద్దేశంతో డబ్బును కూడా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇలాంటి సమయాల్లో నిరుపేద ప్రజలకు... దాతలు చేతనైనా సాయం చేయాలని పుట్టా రామకృష్ణ కోరారు.
ఇదీ చదవండి :రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు