Pushpa Fame Jagadeesh Arrest Update : పుష్ప సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) పక్కన సహాయ నటుడుగా పాత్ర పోషించిన కేశవ(మచ్చ) అలియాస్ జగదీశ్ ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నేరారోపణ ఎదుర్కొంటున్నందుకుగాను జగదీశ్‌ను పంజాగుట్ట పోలీసులు రెండు రోజుల కస్టడీలో తీసుకొని విచారించారు. జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని జగదీశ్ బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ ఫోటోలు తీసి ఆ తర్వాత బెదిరించినట్లు, ఆమె మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో పేర్కొన్నారు.
అత్యాచారం కేసులో యూట్యూబ్ స్టార్ చంద్రశేఖర్ అరెస్టు
ఇంతకీ ఏమి జరిగిందంటే :
Actor Jagadeesh Arrested over Junior Artist Suicide : పుష్పలో అల్లు అర్జున్పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్ (కేశవ) పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పది రోజుల క్రితం ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో కేసు నమోదైంది. జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన జగదీశ్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.