హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 'లాస్య తాండవ ది షాప్స్ ఆఫ్ డ్యాన్స్' పేరిట సబ్రినా అరుసామ్ బృందంచే ప్రదర్శించిన పప్పెట్ నృత్య రూపక ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. తోలుబొమ్మలతో వివిధ ప్రక్రియలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించిన ఈ నృత్యరూపకం కళాభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. భారతీయ సంప్రదాయ నృత్యాలైన.. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీతో పాటు సినిమా పాటలకు సైతం తోలు బోమ్మలతో నృత్యాలు చేయించి మెప్పించారు. తొలుబొమ్మలు, కళాకారులు కలిసి చేసిన ప్రయోగత్మకమైన నృత్య ప్రదర్శనను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కేవి రమణాచారి, సినీ నటుడు భరణి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రవీంద్రభారతిలో పప్పెట్ నృత్యరూప ప్రదర్శన - రవీంద్రభారతి
హైదరాబాద్ రవీంద్రభారతిలో పప్పెట్ నృత్యరూపక ప్రదర్శన వీక్షకులను అలరించింది. తోలుబొమ్మలతో కళాకారులు కలిసి చేసిన ప్రయోగాత్మక నృత్య ప్రదర్శన చూపరులను కళాభిమానులను మంత్రముగ్ధులను చేసింది.
![రవీంద్రభారతిలో పప్పెట్ నృత్యరూప ప్రదర్శన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4211179-470-4211179-1566478413112.jpg)
రవీంద్రభారతిలో పప్పెట్ నృత్యరూప ప్రదర్శన