తెలంగాణ

telangana

ETV Bharat / state

హోంమంత్రిని కలిసిన పంజాబ్​ జైళ్ల శాఖ మంత్రి సుఖ్​జిందర్ - Punjab Jails Minister Sukh Jinder visit Hyderabad Jails

తెలంగాణలోని జైళ్ల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు పంజాబ్‌ జైళ్ల శాఖ మంత్రి సుఖ్‌జిందర్‌ రాంద్వా, అధికారులతో కలిసి హైదరాబాద్​ వచ్చారు. నగరంలోని పలు జైళ్లను సందర్శించారు.

హోంమంత్రిని కలిసిన పంజాబ్​ జైళ్ల శాఖ మంత్రి సుఖ్​జిందర్
హోంమంత్రిని కలిసిన పంజాబ్​ జైళ్ల శాఖ మంత్రి సుఖ్​జిందర్

By

Published : Dec 17, 2020, 9:36 PM IST

పంజాబ్‌ జైళ్ల శాఖ మంత్రి సుఖ్‌జిందర్‌ రాంద్వా... హోంమంత్రి మహమూద్‌ అలీని కలిశారు. సుఖ్‌జింద్‌... జైళ్ల శాఖ అధికారులతో కలిసి తెలంగాణలోని జైళ్ల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌ వచ్చారు. నగరంలోని వివిధ జైళ్లను సందర్శించారు.

రాష్ట్ర జైళ్ల శాఖ ఖైదీలలో మార్పు తెచ్చేందుకు అమలు చేస్తున్న సంస్కరణలను పంజాబ్‌ మంత్రి, అక్కడి అధికారుల బృందం తెలుసుకుంది. ఖైదీలు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు హోంమంత్రి మహమూద్​ అలీ తెలిపారు. వారు పనిచేసేందుకు పరిశ్రమల యూనిట్‌ను ఏర్పాటు చేశామన్నారు.

శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలకు జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంకుల్లో ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం కూడా మరికొన్ని జైళ్లు పరిశీలించనున్నట్టు పంజాబ్‌ మంత్రి సుఖ్‌జిందర్‌ తెలిపారు.

ఇదీ చూడండి: నేరస్థుల పాలిట సింహ స్వప్నంగా రాచకొండ కమిషనరేట్​

ABOUT THE AUTHOR

...view details