పుల్వామాలో అమరులైన జవాన్లకు విశ్వ హిందూపరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్తూపం వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించారు. విశ్రాంతి సమయంలో ఉన్న భారత జవాన్లపై పాక్ దాడి చేయడం పిరికిపంద చర్యేనని వీహెచ్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ అన్నారు.
పూల్వామా అమరవీరులకు నివాళి - హైదరాబాద్ నేటి వార్తలు
గతేడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో ఆర్మీ జవాన్లపై జరిగిన దాడి ఘటన ఎంతో బాధాకరమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి రమేష్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆ దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.
'పుల్వామా ఘటన ఎంతో బాధాకరం'
ఆ చర్యకు ప్రతిచర్యగా భారత్ వారి స్థావరాలను కూల్చేసి ప్రతీకారం తీర్చుకుందన్నారు. మళ్లీ అలాంటి ఘటన చోటుచేసుకునే పరిస్థితి లేదన్నారు.
ఇదీ చూడండి :రోడ్డు భద్రత గాలికి... ప్రాణాలు గాల్లోకి!