తెలంగాణ

telangana

ETV Bharat / state

నిండుకుండను తలపిస్తున్న పులిచింతల జలాశయం - pulichintala project latest news

ఏపీలోని గుంటూరు జిల్లా పులిచింతల జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి 30వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 15వేల క్యూసెక్కుల నీటిని జలవిద్యుత్ కేంద్రానికి మళ్లించినట్లు వెల్లడించారు.

pulichintala-project-full-with-flood-water-in-guntur-dst
నిండుకుండను తలపిస్తున్న పులిచింతల జలాశయం

By

Published : Aug 25, 2020, 8:23 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పులిచింతల జలాశయం నిండుకుండను తలపిస్తోంది. పూర్తి సామర్థ్యం 55.77టీఎంసీలు కాగా... ఉదయం ప్రాజెక్టు నిండిపోయింది. ఎగువ నుంచి ప్రస్తుతం 30వేల క్యూసెక్కులు మాత్రమే వరదనీరు వస్తోంది. దీంతో ఒక గేటు ఎత్తిన అధికారులు 17వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 15వేల క్యూసెక్కుల నీటిని జలవిద్యుత్ కేంద్రానికి మళ్లించారు. పైనుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని బట్టి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టాలు ఉండేలా చూస్తూ.. మిగతా నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతకుమించి వరద ఉంటే గేట్ల ద్వారా బయటకు పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పులిచింతల ప్రాజెక్టులోకి వరదనీరు చేరి జలాశయం నిండిపోవటంతో ఆ దృశ్యాలు చూసేందుకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లను... పచ్చని ప్రకృతిని చూసి పరవశిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద స్వీయచిత్రాలు దిగుతూ జ్ఞాపకాల్ని పదిలం చేసుకుంటున్నారు.

ఇదీ చూడండి:ఎంత ప్రశ్నించినా మౌనమే తహసీల్దార్ సమాధానం

ABOUT THE AUTHOR

...view details