తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2020, 11:48 PM IST

ETV Bharat / state

నిండుకుండలా మారిన పులిచింతల డ్యామ్​

పులిచింతల డ్యామ్ మరోసారి పూర్తి స్థాయిలో నిండింది. డ్యామ్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ముక్త్యాల, వేదాద్రి, రావిరాల వద్ద కృష్ణా నది నీటిమట్టం గణనీయంగా పెరిగింది. డ్యామ్​లో నీటిమట్టం పూర్తిస్థాయిలో 45 టీఎంసీలు నిల్వ ఉండగా... ఎగువ నుంచి 70 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.

pulichintala project
నిండుకుండలా మారిన పులిచింతల డ్యామ్​

శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్​ల నుంచి భారీగా వరద నీరు రావడంతో వల్ల పులిచింతల డ్యామ్ మరోసారి పూర్తిస్థాయిలో నిండింది. శుక్రవారం రాత్రి నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ముక్త్యాల, వేదాద్రి, రావిరాల వద్ద కృష్ణా నది నీటిమట్టం గణనీయంగా పెరిగింది.

శనివారం 3 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి నీటి విడుదల లక్ష క్యూసెక్కులకు తగ్గించారు. డ్యామ్​లో నీటిమట్టం పూర్తిస్థాయిలో 45 టీఎంసీలు నిల్వ ఉండగా... ఎగువ నుంచి 70 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details