హైదరాబాద్ అసెంబ్లీలో ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్, ఆర్మూరు శాసన సభ్యుడు జీవన్ రెడ్డి అధ్యక్షతన సింగరేణిపై పీయూసీ సమావేశం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ అద్భుత ఫలితాలు సాధిస్తోందని జీవన్ రెడ్డి చెప్పారు.
సింగరేణి అద్భుత ఫలితాలు సాధిస్తోంది: జీవన్ రెడ్డి - హైదరాబాద్ తాజా వార్తలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ అద్భుత ఫలితాలు సాధిస్తోందని అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్, ఆర్మూరు శాసన సభ్యుడు జీవన్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో సింగరేణిపై పీయూసీ సమావేశం జరిగింది.
సింగరేణి అద్భుత ఫలితాలు సాధిస్తోంది: జీవన్ రెడ్డి
రాష్ట్రం ఏర్పడక ముందు 12 వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న సింగరేణి ఆదాయం గత ఐదేళ్లలో 30 వేల కోట్ల రూపాయలకు చేరింది. సింగరేణి సంస్థ కేంద్ర, రాష్ట్రాలకు 7 వేల కోట్ల రూపాయల పన్ను చెల్లిస్తోందన్నారు. ఐదేళ్లలో 14 వేల ఉద్యోగాలు కల్పించడం గొప్ప విషయమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సుమారు 60 వేల కుటుంబాలను పోషిస్తున్న సింగరేణి.. విద్యుత్ ఉత్పత్తిలోనూ దూసుకెళ్తోందన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే: సీఎం కేసీఆర్