హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు శిథిల భవనాలు కూలే ప్రమాదం ఉన్నందున అందులో నివసించే ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ సూచించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర వ్యాప్తంగా నాలుగు వేలకు పైగా గుంతలు, గోతులు ఏర్పడినట్లు గుర్తించామని తెలిపారు. వాటిలో ఇప్పటికే 50 శాతం పూడ్చేశామని స్పష్టం చేశారు. వర్షాలకు రోడ్లపై ఏర్పడిన గుంతలతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు.
వీటి మరమ్మతులు, పునరుద్ధరణ పనులను కమిషనర్ తనిఖీ చేశారు. అనంతరం కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, సుచిత్ర జంక్షన్, చింతల్, బాలానగర్, మియాపూర్‌లలో రోడ్ల మరమ్మతు పనులను పరిశీలించారు. నేడు ఎడతెరిపి లేని వర్షం కురిసిందని.. ఇలాగే కొనసాగితే రేపు సాయంత్రానికి మిగతా గుంతలు పూడ్చివేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
'శిథిలావస్థ భవనాలను వెంటనే ఖాళీ చేయండి'
హైదరాబాద్‌లో కురిసిన ఎడతెరిపిలేని వర్షం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన భవనాలను ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ కోరారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి త్వరలోనే గుంతలను పూడ్చి వేస్తామని తెలిపారు.
రోడ్లను పరిశీలించి త్వరలోనే మిగతా గుంతలను పూడ్చేస్తాం : దాన కిషోర్