తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2020, 8:23 PM IST

Updated : Mar 22, 2020, 8:46 PM IST

ETV Bharat / state

స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష: కేసీఆర్

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ఈనెలాఖరు వరకు ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. పౌరులందరూ దయచేసి ఇళ్లకే పరిమితం కావాలంటూ విజ్ఞప్తి చేశారు.

'Public Release Until The End Of Time'
ప్రజారవాణా పూర్తిగా బంద్

ప్రజారవాణా పూర్తిగా బంద్

ఈనెలాఖరు వరకు ప్రజారవాణా పూర్తిగా మూసివేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు తప్పనిసరిగా ఆపేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే రైళ్లు కూడా పూర్తిగా నిలిపివేశారని గుర్తు చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు పూర్తిగా మూసివేసినట్లు వెల్లడించారు. కూరగాయలు, అత్యవసర సరుకుల వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు వివరించారు. సరిహద్దుల్లో ప్రజా రవాణా వాహనాలు అన్ని పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు.

పౌరులందరూ దయచేసి ఇళ్లకే పరిమితం కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని సీఎం పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నుంచి మీడియాకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. వారంరోజులు ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండి ఈ మహమ్మారి నుంచి మనల్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్‌ : బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు

Last Updated : Mar 22, 2020, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details