కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో.. ఆయా సంఘాల కార్యదర్శులు గోడ పత్రికను ఆవిష్కరించారు.
రేపు సాయంత్రం ఆన్లైన్లో రైతు సంఘాల సభ - farmer associations meeting
కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపాయి.
కార్పొరేట్ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను కాల రాసిందని వారు మండి పడ్డారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న సమయంలో.. కేంద్రం నిర్లక్ష్యంతో అనేక మంది మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమ, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు పద్మ, తదితరులు పాల్గొన్నారు.