తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫెలోషిప్​ అక్రమాలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం - ఓయూ, కేయూలో అక్రమాలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

ప్రతిష్టాత్మక ఉస్మానియా, కాకాతీయ విశ్వవిద్యాలయాల్లో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పిల్​ దాఖలైంది. ఫెలోషిప్​ల మంజూరులో అవతకవకలు జరిగాయని ఆరోపిస్తూ పీహెచ్​డీ అభ్యర్థి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Public interest litigation in the High Court on Fellowship Irregularities by phd candidate srinivas
ఫెలోషిప్​ అక్రమాలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

By

Published : Dec 24, 2020, 1:15 PM IST

యూనివర్సిటీ​ గ్రాంట్స్​ కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఫెలోషిప్​లు మంజూరు చేశారంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ పీహెచ్​డీ అభ్యర్థి కె.శ్రీనివాస్​ పిటిషన్​ వేశారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీల్లో అక్రమాలు జరిగాయంటూ పిటిషనర్​ ఆరోపించారు.

పిటిషన్​ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, యూజీసీ, సీబీఐ, ఓయూ, కేయూలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గడువు విధించింది.

ఇదీ చూడండి:'ప్రభుత్వమే కబ్జా చేస్తే.. ఎవరికి ఫిర్యాదు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details