తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యక్తిగత పరిశుభ్రతే వైరస్​ నివారణకు మందు'

లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. నాల్గొ దశలో లాక్‌డౌన్‌ సడలింపుల వల్లే కరోనా కేలుసు పెరిగాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కు, భౌతిక దూరం పాటించాలని కోరారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

telangana health director
telangana health director

By

Published : May 30, 2020, 5:58 PM IST

వ్యక్తిగత పరిశుభ్రతే వైరస్​ నివారణకు మందు

రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైనప్పటినుంచి ఇప్పటివరకు కొవిడ్-19 నిర్మూలనకు కృషి చేస్తున్నామని వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. లాక్​డౌన్ సడలింపు తరువాత కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరిగాయని తెలిపారు. భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారానే వైరస్ బారిన నుంచి రక్షించుకోగలమన్నారు.

రాష్ట్రంలో శుక్రవారం వరకు స్థానికంగా 2008 కేసులు నయోదయ్యాయి. తొలుత విదేశాల నుంచి వచ్చిన వారు, మార్కజ్ నుంచి వచ్చిన వారి వల్ల కేసులు ఎక్కువగా పెరిగాయి. లాక్​డౌన్ సమయంలో కొందరి వల్ల అనేక కుటుంబాలు వైరస్ బారిన పడ్డాయి. గతంలో సూర్యాపేటలో ఒక వ్యక్తి వల్ల 82 మందికి పాజిటివ్ వచ్చింది. బోరబండలో ఒక యువకుడు అమ్మమ్మ ఇంటికి వెళ్లివచ్చి... పార్టీ చేసుకోగా 20 మందికి పాజిటివ్​గా తేలింది. వందే భారత్​లో భాగంగా రాష్ట్రానికి వచ్చిన వారికి పాజిటివ్​ వచ్చింది.

-డాక్టర్ శ్రీనివాస్ రావు, ప్రజా వైద్య ఆరోగ్య అధికారి

కరోనా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రజలు బయటకు వస్తున్నప్పుడు కొవిడ్​-19 కేసులు సహజంగానే పెరుగుతాయని డీఎంఈ డా.రమేశ్​ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. అయినప్పటికీ ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఆరోగ్య నియమాలు పాటించి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్త నిబంధన ప్రకారం ఇంట్లోనే ఉంచి రోగికి చికిత్స అందించవచ్చన్నారు. లక్షణాలు లేకుండా పాజిటివ్ ఉన్న రోగులకు ఇంట్లో వసతి లేకపోతే ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచే దిశగా చర్యలు చేపడతున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 వేల పరీక్షలు చేశాం. ఉస్మానియాలో ఒక మెస్‌ వర్కర్‌కు కరోనా వచ్చింది. వైరస్ బాధితుల్లో 80 శాతం మందికి ఎలాంటి చికిత్స అవసరం లేదు. కేవలం 5 శాతం మందికే చికిత్స అవసరం. 71 శాతం మరణాల్లో అత్యధికంగా ఇతర వ్యాధులతో బాధ పడుతున్న వారే. కరోనా వల్ల భవిష్యత్తులో ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. వ్యాధి సోకినప్పుడు ఎలాంటి ప్రభావం లేకపోయినా భవిష్యత్తులో అది ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

-రమేశ్​ రెడ్డి, డీఎంఈ

ఇదీ చూడండి:మోదీ 2.0: జల సంరక్షణతోనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు

ABOUT THE AUTHOR

...view details