రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కట్టడిలో భాగంగా తెలంగాణ సర్కార్ లాక్డౌన్ విధించింది. అయితే ప్రజల వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు యథావిధిగా వైద్య సేవలు అందిస్తాయన్న ఆయన... కొవిడ్ టెస్ట్‌లను కొనసాగించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాక్సినేషన్ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం ఉండదని డీహెచ్ తెలిపారు.
'అన్ని ఆసుపత్రుల్లో యథావిధిగా వైద్య సేవలు'
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు యథావిధిగా వైద్య సేవలు అందిస్తాయని... ఎలాంటి ఆటంకం కలగదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. రెండో డోస్ అవసరం అయిన వారికి మాత్రమే వాక్సినేషన్ ఇవ్వనున్నారని.. తొలిడోస్ తీసుకున్నట్టు పాక్షిక వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపాలని ప్రకటనలో పేర్కొన్నారు.
రెండో డోస్ అవసరం అయిన వారికి మాత్రమే వాక్సిన్ ఇవ్వనున్నారని స్పష్టం చేశారు. అయితే టీకాకి అర్హులైన వారు... తొలిడోస్ తీసుకున్నట్టు పాక్షిక వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపాలని ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారు దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి టెస్ట్‌లు చేయించుకోవాలని కోరారు. ఆసుపత్రులకు వెళ్లే వారికి ఎలాంటి ఆటంకం కలిగించరాదని ఇప్పటికే పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చినట్టు ప్రజారోగ్య సంచాలకులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్2.0: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిషేధం