తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్లపైకి రసాయన వ్యర్థాలు... అవస్థల్లో ప్రజలు - Hyderabad_Kukatpally_Asbestas colony_chemical Factories

హైదరాబాద్ కూకట్​పల్లి ఆస్బెస్టాస్​ కాలనీలో సమీప రసాయన కంపెనీలు వదిలిన వ్యర్థ జలాలతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. దీనిపై కంపెనీల యాజమాన్యాలకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు.

COMPANY CHEMICAL WATER
COMPANY CHEMICAL WATER

By

Published : Feb 3, 2020, 11:20 AM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి ఆస్బెస్టాస్​ కాలనీలో రసాయన కంపెనీలు విడిచే వృథా జలాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట ఎవరూ లేని సమయంలో వ్యర్థ నీటిని రోడ్లపైకి వదిలి చేతులు దులుపుకుంటున్నారని కాలనీవాసులు చెప్తున్నారు. దీని వల్ల తాము అనేక అవస్థలు పడాల్సి వస్తుందని.. ముక్కు మూసుకొని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వాపోతున్నారు.

కంపెనీల యజమానులకు ఫిర్యాదు చేస్తే... మరోసారి సమస్య రాకుండా చూసుకుంటామని చెప్పి... ఇప్పుడు యధావిధిగా రోడ్డుపైకే రసాయన జలాలను విడుదల చేస్తున్నారని తెలిపారు. దీంతో ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అంటున్నారు.

ఈ సమస్యలపై అధికారులకు విన్నవించినా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు కల్పించుకొని జనావాసాలకు దూరంగా వ్యర్థ జలాలను తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రసాయన వ్యర్థజలాలతో ఆస్బెస్టాస్​ కాలనీ వాసుల ఇక్కట్లు

ఇదీ చూడండి:కొత్త విధానంలోనూ కొన్ని మినహాయింపులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details