కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని సామాజిక కార్యకర్త దినేష్ గుప్త కోరారు. కరోనా వైరస్ విస్త్రృతంగా వ్యాప్తి చెందుతోందని...దాని అందరం కలిసి అడ్డుకుందామన్నారు. అత్యవసర సమయంలోమే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. హిమాయత్ నగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త దినేష్ గుప్త గత 25 రోజులుగా కరోనా వైరస్ నియంత్రణపై అవగాహన కల్పించారు. ప్రతి రోజు సైకిల్‌పై తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నాడు. ఇంట్లోనే ఉండండి...కరోనాను తరిమికొట్టండి అంటూ నినాదాలు ఇస్తున్నాడు.
కరోనా నివారణకు సైకిల్‌పై చైతన్య యాత్ర
హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త దినేశ్ గుప్త వినూత్న రీతిలో కరోనా నివారణపై అవగాహన కల్పిస్తున్నాడు. బయటకు రాకూడదని...అత్యవసరంలో వస్తే మాస్కును తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
కరోనాపై దినేశ్ గుప్త సైకిల్ యాత్ర