భాగ్యనగరం కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని మజిద్ గల్లీతో పాటు పలు ప్రాంతాల్లో యువత పబ్జీ గేమ్స్‌ను ఆడుతూ పెడదోవ పడుతున్నారు. ప్రధానంగా చదువుకునే వారితో పాటు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న యువత ఈ ఆన్లైన్ ఆటకు అలవాటు పడి అర్ధరాత్రిళ్లు సైతం రోడ్లపైనే తిరుగుతున్నారు. ఈ క్రమంలో కార్ఖానా పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి సీఐ మధుకర్ స్వామి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలు ఉదయం నిద్రలేచిన నుంచి వారు ఏం చేస్తున్నారో చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.
పబ్జీ గేమ్మాయలో పడ్డ హైదరాబాద్ యువత - పబ్జీ గేమ్స్‌ను మొబైల్స్‌లో ఆడుతున్న హైదరాబాద్ యువత
హైదరాబాద్ కార్ఖానా పీఎస్ పరిధిలో యువత పబ్జీ గేమ్స్ ఆడుతూ పెడదోవ పడుతున్నారు. ఆన్లైన్ ఆటకు అలవాటు పడి అర్ధరాత్రిళ్లు సైతం రోడ్లపైనే తిరుగుతున్నారు. ఈ క్రమంలో కార్ఖానా పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
పబ్జీ గేమ్మాయలో పడ్డ హైదరాబాద్ యువత
అర్ధరాత్రి వరకు రోడ్లపైనే ఉండడం కాకుండా ఫోన్లలో ఆటలు ఆడుతూ పెడదోవ పడుతున్నారని, ఇప్పటికైనా మంచి నడవడికతో నడిచే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని పోలీసులు సూచించారు. పట్టుబడిన ఎనిమిది మంది పై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఇవీ చూడండి:పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములవ్వాలి: సీఎస్