Pub Fight: హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రిజం పబ్‌లో వినియోగదారులు, యాజమాన్యం పరస్పర దాడులకు పాల్పడ్డారు. నో స్మోకింగ్ జోన్‌లో సిగరెట్ తాగుతున్న నంద కిషోర్‌తో మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. బౌన్సర్లు తనను విచక్షణారహితంగా కొట్టారంటూ నంద కిషోర్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పబ్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశాడు. మద్యం మత్తులో సిగరెట్ తాగోద్దని వారించినా వినకుండా నంద కిషోర్, అతడి స్నేహితులు ఘర్షణకు దిగాడంటూ పబ్ నిర్వాహకులు తెలిపారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపడతామని వెల్లడించారు.
Pub Fight: సిగరెట్ తాగొద్దన్నందుకు పబ్‌లో గొడవ - Gachobowli Pub News
Pub Fight: నో స్మోకింగ్ జోన్‌లో సిగరెట్ తాగొద్దని వారించగా... వినియోగదారుడికి, పబ్ యాజమాన్యానికి మధ్య ఘర్షణ తలెత్తిన ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిగరెట్ తాగొద్దని వారించినా.. తమపైనే దాడికి పాల్పడ్డాడంటూ పబ్ సిబ్బంది ఆరోపించారు.
Pub
Last Updated : Apr 25, 2022, 9:42 AM IST