తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్కింగ్​లో ఉన్న కారుపై  ఓ ఉన్మాది వీరంగం - సైకో

హైదరాబాద్​ మెహదీపట్నంలో ఓ యువకుడు సైకోలా ప్రవర్తించాడు. పార్కింగ్​ చేసి ఉన్న కారు పైకి దూకి ముందు భాగంలోని అద్దం పగులగొట్టాడు. ఈ దృశ్యాన్ని చూస్తున్న స్థానికులు, కారు యజమాని భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పార్కింగ్​ కారుపై  ఓ ఉన్మాది వీరంగం

By

Published : Aug 22, 2019, 7:44 PM IST

హైదరాబాద్ మెహదీపట్నంలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. పార్కింగ్ చేసి ఉన్న కారుపైకి ఎక్కి అమాంతం ముందు భాగంలోని అద్దం పగులగొట్టాడు. ఏకంగా లోపలకు దూసుకుపోయాడు. ఈ హఠాత్పరిణామం పట్ల కారు యజమాని సహా... స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇలా ఎందుకు వ్యవహరించాడు... మద్యం సేవించాడా లేక మాదక ద్రవ్యాల ప్రభావంతో ఇలా చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

పార్కింగ్​లో ఉన్న కారుపై ఓ ఉన్మాది వీరంగం
ఇదీ చూడండి: చరవాణిలో నగ్న చిత్రాలు పంపించు... లేకుంటే?

ABOUT THE AUTHOR

...view details