తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమించలేదని నరికేశాడు.. - hyd

ప్రేమను అంగీకరించలేదని కొబ్బరిబోండాల కత్తితో చంపేందుకు ప్రయత్నించాడు ఓ ఉన్మాది. హైదరాబాద్​లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

stabbed

By

Published : Feb 6, 2019, 12:00 PM IST

Updated : Feb 6, 2019, 2:50 PM IST

మైనర్ బాలికపై కత్తితో దాడి
హైదరాబాద్ బర్కత్​పురా సమీపంలోని సత్యానగర్​లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను అంగీకరించలేదని మైనర్​ను చంపేందుకు యత్నించాడు. కొబ్బరి బోండాలకు ఉపయోగించే కత్తితో దాడికి తెగబడ్డాడు. తీవ్రగాయాలైన అమ్మాయిని మలక్​పేట ప్రైవేటు అసుపత్రికి తరలించారు. బర్కత్​పురా పరిధిలోని సత్యానగర్​లో రాములు కూతురు మధులిక ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అదే కాలనీలో ఉంటున్న భరత్ కొన్ని రోజుల నుంచి ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. బుద్ధి మార్చుకోమని భరత్​కు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మారలేదు. రెండు రోజుల ముందు బాధితురాలి తల్లికి ఫోన్ చేసి బెదిరించాడు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో చంపేందుకు ప్రయత్నించాడు. కొబ్బరికాయలు నరికే కత్తితో అతి దారుణంగా పొడిచాడు. బాధితురాలి మెడ, పొట్ట, చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.
Last Updated : Feb 6, 2019, 2:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details