PSLV C54 Launch : శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)-సి54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్ ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. ఈవోఎస్ శాట్-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-54 నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లింది. ఓషన్ శాట్ ఉపగ్రహాల ద్వారా భూవాతావరణం పరిశీలన, తుపానులను పసిగట్టడం, వాతావరణంలో తేమ అంచనా, సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం చేయనున్నారు. హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం.. మీథేన్ లీకులు, భూగర్భ చమురు, పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు దోహదపడుతుంది. ప్రయోగం విజయవంతం కావడంపై ఇప్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
PSLV C54 Launch : విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ సీ-54 ప్రయోగం - launch of PSLV C 54 Successful
పీఎస్‌ఎల్‌వీ సీ-54 ప్రయోగం విజయవంతం
12:17 November 26
శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్
Last Updated : Nov 26, 2022, 1:58 PM IST