హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో (Chakali Ilamma Jayanthi) భాజపా, తెరాస మధ్య ప్రోటోకాల్ వివాదం రేగింది. చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో గులాబీ, కమలం పార్టీ నాయకుల వాగ్వాదంతో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.
హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో స్థానిక శాసనసభ్యుడు ముఠా గోపాల్ (Mla Muta Gopal)... ఫొటో లేకపోవడం వల్ల తెరాస నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కార్పొరేటర్ రచన శ్రీ.. ఫొటో కూడా లేదని భాజపా నాయకులు అధికారులను నిలదీశారు.