హైదరాబాద్ ముషీరాబాద్ రిసాల గడ్డలోని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యునియన్ కార్యాలయంలో ఎస్‌డబ్ల్యుఎఫ్ ఉప ప్రధాన కార్యదర్శి లింగమూర్తి మూడు రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను రాజకీయ ప్రముఖులు విరమింపజేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మందకృష్ణ మాదిగ, సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్ తదితరులు నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
'లింగమూర్తి దీక్ష విరమణ... ఆందోళనలు కొనసాగుతాయి' - లింగమూర్తి దీక్ష విరమణ... ఆందోళనలు కొనసాగుతాయి : కోదండ రాం
హైదరాబాద్ ముషీరాబాద్‌లో మూడురోజులుగా ఎస్‌డబ్ల్యుఎఫ్ ఉప ప్రధాన కార్యదర్శి లింగమూర్తి చేస్తోన్న నిరవధిక నిరాహార దీక్షను విరమించారు.
హైకోర్టు నుంచి సానుకూల ప్రకటన వచ్చిన నేపథ్యంలో లింగమూర్తి దీక్ష విరమింపజేసిన్నట్లు నేతలు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించాలని, పది హేను రోజుల్లో కార్మిక కోర్టు జోక్యం చేసుకోవాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొందని కోదండ రాం అన్నారు. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని... ఆందోళన యథాతధంగా చేపడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న మెుండి వైఖరి విడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కార్మికులు ఐక్యంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి విజయం సాధించాలని మందకృష్ణ మాదిగ సూచించారు.
ఇవీ చూడండి : దుకాణాదారుకు మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు..