రైతులకు మద్దతుగా చేపట్టిన భారత్ బంద్‌లో అధికార తెరాసతో పాటు సీపీఎం, కాంగ్రెస్ శ్రేణులు నిరసనలతో కదం తొక్కాయి. మంత్రి కేటీఆర్ బంద్‌కు పిలుపునివ్వడంతో సికింద్రాబాద్ అడ్డగుట్టలో తెరాస నాయకులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. తుకారాంగేట్, శాంతినగర్, లాలాపేట్ మీదుగా తిరుగుతూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డగుట్ట చౌరస్తాలో డివిజన్ కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.
కేంద్రానికి వ్యతిరేకంగా హోరెత్తిన నిరసనలు - భారత్‌బంద్‌లో పాల్గొన్న తెరాస, సీపీఎం, కాంగ్రెస్
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్‌లో భాగంగా తెరాస, సీపీఎం, కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలియజేశాయి. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కేంద్రానికి వ్యతిరేకంగా హోరెత్తిన నిరసనలు
అడ్డగుట్టలో సీపీఎం నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోదీ దిష్టిబొమ్మను తగలబెట్టారు. తుకారాంగేట్‌లోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పాదయాత్ర చేపట్టారు.