తెలంగాణ

telangana

ETV Bharat / state

'అశోక్​ గజపతిరాజుపై మంత్రి వ్యాఖ్యలు అనుచితం' - అశోక్​ గజపతిరాజుపై వెల్లంపల్లి వ్యాఖ్యలు

కేంద్ర మాజీ మంత్రి అశోక్​ గజపతిరాజుపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్​ కొంపల్లిలో క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై సీఎం జగన్​ వెంటనే స్పందించి శ్రీనివాస్​ను మంత్రి మండలి నుంచి తొలగించాలని సంఘం సభ్యులు డిమాండ్​ చేశారు.

ap, ashok gajapathi, vellampalli srinivas, kshatryiya sangham
అశోక్​ గజపతి, వెల్లంపల్లి శ్రీనివాస్​, ఏపీ, క్షత్రియ సంఘం

By

Published : Jan 4, 2021, 12:10 PM IST

హైదరాబాద్ కొంపల్లిలో క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. ఎన్నో దాన ధర్మాలు చేసిన అశోక్​ గజపతిని ధర్మకర్త పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు. ఒక గొప్ప వ్యక్తిని వెల్లంపల్లి శ్రీనివాస్ అవమానించేలా మాట్లాడారని.. వెంటనే​ గజపతి కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏపీలోని ప్రతి క్షత్రియుడు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి సీఎం జగన్​ వెంటనే స్పందించి శ్రీనివాస్​ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయలకతీతంగా అధికారపక్షం, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:వెలుగులోకి వచ్చిన ఖమ్మం తోగు కోట

ABOUT THE AUTHOR

...view details