వరద బాధితులకు 10వేల రూపాయల చొప్పున.. తక్షణ ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎంపీ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల డీసీసీ నేతలతో పాటు మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వరద సాయం పంపిణీలో అక్రమాలు జరిగాయని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బాధితులను వెంటనే ఆదుకోవాలని నినాదించారు.
వరద సాయం రూ.550 కోట్లలో సగానికి పైగా తెరాస నేతలు దోచుకున్నారు. లబ్ధిదారులకు పైసలు అందలేదు.. తెరాస కార్యకర్తలకే చేరాయి. తెరాస నేతలు వరద సాయం రూ.10 వేలులో సగం కొట్టేస్తున్నారు. ఓట్లు కొనుగోలు చేయడానికే నగదు బదిలీ పథకం పెట్టారు. రూ.8,860 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రధానికి సీఎం లేఖ రాశారు.. తెరాస ప్రభుత్వం ఇచ్చిన రూ.550 కోట్లు ఏ మేరకు సరిపోతాయి? -రేవంత్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ