అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ చేస్తున్న ఉద్యమానికి.. హైదరాబాద్‌లోనూ మద్దతు లభిస్తోంది. రాజధాని కోసం చేస్తున్న ఉద్యమం 300రోజులకు చేరిన సందర్భంగా సంఘీభావం తెలుపుతూ కేబీఆర్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు.
అమరావతి ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్‌లో నిరసన - హైదరాబాద్‌లో అమరావతి ఉద్యమం
అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరిన సందర్భంగా.. రాజధాని రైతులకు హైదరాబాద్‌లో పలువురు మద్దతు తెలిపారు. రైతులకు సంఘీభావంగా కేబీఆర్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు.

అమరావతి ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్‌లో నిరసన
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలించారు.
ఇదీ చూడండి:ఔరా అనిపిస్తున్న ఖైరతాబాద్ పైవంతెన పెయింటింగ్స్!