తెలంగాణ

telangana

ETV Bharat / state

సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్ల నిరసన - nurse protest latest updates

నర్సుల నియామకాలను రెగ్యూలర్ విధానంలో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్లు ఆందోళన చేపట్టనున్నారు.

సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ అధికారుల నిరసన
సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ అధికారుల నిరసనసోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ అధికారుల నిరసన

By

Published : Aug 9, 2020, 5:13 PM IST

ప్రభుత్వ ఆధ్వర్యంలో నియమించే నర్సులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో కాకుండా రెగ్యూలర్‌ విధానంలో భర్తీ చేయాలని నర్సింగ్ ఆఫీసర్లు డిమాండ్ చేశారు. తాత్కాలికంగా నియమించే పోస్టులలో ఎవరూ కూడా జాయిన్ కావొద్దని నిర్ణయించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై ప్రభుత్వం చొరవ తీసుకుని 3,311 నర్సు పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి కరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి సంఘీభావం ప్రకటించాలని తీర్మానించారు. కరోనా పోరులో అమరుడైన డాక్టర్ నరేశ్, నర్సింగ్ ఆఫీసర్ జయమణికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో ఒకరికి జాయింట్ కలెక్టర్ ఉద్యోగం, 500 గజాల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి నర్సింగ్ ఆఫీసర్ ఉన్నచోటనే బ్లాక్ రిబ్బన్, బ్లాక్ జెండా పట్టుకొని నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేసింది.

ABOUT THE AUTHOR

...view details