నూతన వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. రైతుకు కనీస మద్దతు ధర పొందేందుకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద అఖిల భారత రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘాలతోపాటు ఇతర సంఘాలు ధర్నా చేపట్టాయి.
ప్రధాని మోదీ నిర్లక్ష్యం వల్లే దేశంలో రైతులు చనిపోయారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతోపాటు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.