హైదరాబాద్ హిమాయత్‌నగర్ వీధి నంబర్14లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ముందు స్థానికులు రెండోరోజు ఆందోళన కొనసాగించారు. జనావాసాల మధ్య ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్నారని ఆందోళన చేపట్టారు. కరోనా రోగులు వాడిన మాస్కులు, చేతి తొడుగులను వీధుల్లోనే విసిరేస్తుండటం వల్ల భయాందోళనలకు గురవుతున్నామని పేర్కొన్నారు.
కొవిడ్ చికిత్సకు అనుమతి ఇచ్చిన ఆసుపత్రుల జాబితాలో సదరు దవాఖానా లేదని ఆరోపించారు. ముఖ్యంగా ఆసుపత్రిలో బాధితులున్న గదులన్నీ తమ అపార్ట్మెంట్లకు ఆనుకొనే ఉన్నాయని వాపోయారు. నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.