తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రపోజ్​ డే స్పెషల్​.. ఇలా ప్రపోజ్​ చేసి చూడు.. పిల్ల పడకుంటే అడుగు..!

Propose Day Special: ఒక అమ్మాయిని ప్రపోజ్​ చేస్తే అందరి కంటే భిన్నంగా ఉండాలి. ఎంతలా ఉండాలి అంటే మరి ఇంకెవ్వరూ నీలా ప్రపోజ్​ చేయకూడదు అన్నంతలా.. మరి పిల్లను పడగొట్టాలి అంటే.. ఈ ట్రిక్స్​ ఫాలో కండి. మరి ఇంకెందుకు ఆలస్యం మిత్రమా.. ఒకసారి చూడు మరీ.!

propose day
ప్రపోజ్​ డే

By

Published : Feb 8, 2023, 3:13 PM IST

How To Propose To A Girl: వయసు ముసురుకొస్తుంది వాన మబ్బులా.. సొగసు దూసుకొస్తుంది సూది మెరుపులా.. అంటూ నవయవ్వన ప్రాయంలో ప్రేమ అనేది పుట్టుకొస్తుంది. ఎన్ని యుగాలు మారినా.. జగాలు మారినా.. మార్పు రానిది ప్రేమ ఒక్కదానిలోనే. నాటి లైలా-మజ్నూ మొదలుకొని.. నేటి తరం నిజమైన ప్రేమికుల వరకు అందరూ స్వచ్ఛమైన ప్రేమనే కోరుకున్నారు. కోరుకుంటారు కూడా. ప్రేమ కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. నిజమైన ప్రేమ కోసం ప్రాణాలనూ లెక్కచేయని అపర ప్రేమికులు ఎంతమందో..! ప్రేమకు ఎప్పుడూ మరణం లేదు. శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయి ఉంటూ.. శరీరానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చేదే ప్రేమంటే.

ప్రపోజ్​ డే స్పెషల్​

స్వచ్ఛమైన ప్రేమలో అమ్మ ప్రేమ ఉంటుంది.. నాన్న పాలన ఉంటుంది. అల్లరి ఉంటుంది.. ఆప్యాయతా ఉంటుంది. అప్పుడప్పుడు అలకలతో కూడిన గిల్లికజ్జాలు, వారి బుంగ మూతులకు మన బుజ్జగింపులూ ఉంటాయి. అయితే ఇవన్నీ ప్రేమలో ఉన్నప్పుడే.. ఎదుటి వ్యక్తిని నిజంగా ప్రేమించినప్పుడే ఆ తీపి గుర్తులను అనుభవించగలం.. ఆస్వాదించగలం.

ఇంతటి మధురానుభూతైన ప్రేమను ఎవరైనా ఎందుకు కోరుకోరు చెప్పండి..? అందరూ ప్రేమిస్తారు.. అందరికీ ప్రేమ కావాలి. కానీ ప్రేమ అందరికీ దక్కదు. చివరి శ్వాస వరకు ప్రేమించిన వారి క్షేమాన్ని కోరడమే నిజమైన ప్రేమ. ఇలాంటి ప్రేమ దక్కాలంటే ప్రియుడికైనా.. ప్రేయసికైనా మొదటి అడుగు తనలోని ప్రేమను వ్యక్త పరచడమే(ప్రపోజ్‌ చేయడం). అది కూడా అందరిలా కాకుండా భిన్నంగా ఉంటే మరింత అందంగా ఉంటుంది. ఎందుకంటే నీ కంటే ముందు తనకు/ ఆమెకు ఎందరో ప్రపోజ్‌ చేసి ఉంటారు. అందరిలాగే మనమూ చెప్తే ఎలా..? వారికీ మనకీ తేడా ఏంటి..?

ప్రపోజ్​ డే స్పెషల్​

ఈ రోజుల్లో లవ్‌ అనే పేరుతో టైమ్​ పాస్​ చేసే ఎంతో మందిని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. నువ్వూ అందులో ఒకడివైతే స్పెషల్​ ఏం ఉంది. మనం కాస్త డిఫరెంట్​గా కనిపిస్తేనే కదా.. నీ ప్రపోజల్​ను వినేంత టైమైనా దొరుకుతుంది. టైమ్​ దొరికింది కదా అని అందరిలా ఏ పువ్వో, చాక్లెటో.. లేదా ట్రెండ్​కు తగ్గట్టుగా అనుకొని ఏ కాస్ట్​లీ ఐఫోన్​ లాంటివి ఇచ్చినా అంత స్పెషల్​గా ఏమీ ఉండకపోవచ్చు. అలాంటివేమీ ఇవ్వకపోయినా.. భవిష్యత్తు ఎలా ఉంటుందో తన కళ్ల ముందు ఊహించుకునే విధంగా ''పిల్లా ఓ పిల్లా.. భూలోకం దాదాపు కన్ను మూయు వేళ''.. ఆ చివరి క్షణంలో కూడా నీ చేయి పట్టుకుని నీతో పాటు కలిసి వస్తాను అని రియాల్టీగా ప్రపోజ్‌ చేస్తే.. కనీసం చేయడానికి ప్రయత్నిస్తే ఆ అమ్మాయి నీది అవుతుందేమో..!

ప్రపోజ్​ డే స్పెషల్​

ఒక్కసారి ఇద్దరు ప్రేమలో పడిన తరవాత సమయం దొరికినప్పుడల్లా తనని భవిష్యత్తులో ఎంత ప్రేమగా చూసుకుంటావో చెబుతూ.. మళ్లీ మళ్లీ ప్రపోజ్‌ చేస్తూనే ఉండాలి. సమయం దొరికినప్పుడు ఈ లోకానికి దూరంగా.. ఒకరికి ఒకరు దగ్గరగా ఉంటూ తమ భావాలను వ్యక్త పరుచుకుంటూ.. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి.

ప్రపోజ్​ డే స్పెషల్​

ఇలా చేయడం వల్ల ఆ బంధం ఇంకా ధృఢంగా మారుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా(లవ్‌ మ్యారేజ్‌/ఎరేంజ్డ్‌ మ్యారేజ్‌) కావచ్చు. అయినా సరే ప్రపోజ్‌ చేయడం చాలా ముఖ్యం. నా భార్యే కదా.. ఇంకా నాతోనే ఉంటుంది. మళ్లీ కొత్తగా ఈ ప్రపోజల్స్​ ఏంటి.. అవసరమా అనుకోవద్దు. మనలో ఉన్న ప్రేమను వ్యక్తపరిచినప్పుడే మనం అవతలి వారిని ఎంత ప్రేమిస్తున్నామో.. వారికి ఎంత ఇంపార్టెన్స్​ ఇస్తున్నామో తెలిసేది. సో.. లవ్​ స్టార్టింగ్​లో అయినా.. లవ్​లో ఉన్నప్పుడు అయినా.. పెళ్లైన కొత్తలో అయినా.. పిల్లలు పుట్టి వారికీ పెళ్లిళ్లు అయినా.. మనకు మన లవర్ ఎప్పటికీ లవరే కదా బాస్.. సో డోంట్​వర్రీ.. ప్రపోజ్​ చేయడానికి ఎదురుగా ఉంది ఒకప్పటి నీ లవరే మరి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ ప్రపోజ్ డే రోజు నీ స్టైల్​లో నువ్వు ప్రపోజ్​ చేసి.. పిల్లను నీదాన్ని చేసుకో... ఆల్రెడీ నీదైన పిల్లను మరోసారి ఇంప్రెస్​ చేసుకో.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details