తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.721 కోట్ల ఆస్తి పన్ను వసూలు - Property tax

రాష్ట్రంలో పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో గత (2020-21) ఆర్థిక సంవత్సరంలో రూ.721 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. రాష్ట్రంలోని 9 పురపాలక సంఘాల్లో 100 శాతం ఆస్తిపన్ను, బకాయిలు వసూలవ్వడం గమనార్హం.

రూ.721 కోట్ల ఆస్తి పన్ను వసూలు
రూ.721 కోట్ల ఆస్తి పన్ను వసూలు

By

Published : Apr 12, 2021, 9:52 AM IST

రాష్ట్రంలో 141పట్టణ స్థానికసంస్థల్లో (జీహెచ్‌ఎంసీ మినహా) ఆస్తి పన్ను మొత్తం రూ.799 కోట్లలో 90 శాతం వసూలు చేసినట్లు పురపాలక శాఖ పేర్కొంది. 99 స్థానిక సంస్థల్లో 90%, అంతకంటే ఎక్కువ ఆస్తిపన్ను వసూలైంది. సిరిసిల్ల, మెట్‌పల్లి, కోరుట్ల, కొత్తగూడెం, పాల్వంచ, ఖానాపూర్‌, కోదాడ, చిట్యాల, దుబ్బాక పురపాలికల్లో వంద శాతం పన్ను రాబట్టారు. చండూరు పురపాలక సంఘంలో రాష్ట్రంలో అతి తక్కువగా.. అంటే లక్ష్యంలో 56 శాతం మాత్రమే పన్ను వసూలైంది. తర్వాత స్థానాల్లో కొత్తకోట, అయిజ, రామాయంపేట, పెబ్బేరు ఉన్నాయి. వరంగల్‌ నగర పాలక సంస్థలో కూడా తక్కువగా 80 శాతం మాత్రమే ఆస్తిపన్ను వసూలైంది.

ABOUT THE AUTHOR

...view details