జీహెచ్ఎంసీ సహా పట్టణప్రాంతాల్లో ఇళ్ల ఆస్తిపన్ను రాయితీపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.15వేల లోపు, ఇతర పట్టణాల్లో రూ.పది వేలలోపు పన్నులో యాభై శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించగా... పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇళ్ల పన్ను రాయితీపై ఉత్తర్వులు జారీ
పట్టణ ప్రాంతాల్లోని ఇళ్ల పన్నుపై రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం రాయితీ ప్రకటించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి జారీ చేశారు. ఇప్పటికే పన్ను చెల్లించి ఉంటే వచ్చే ఏడాదికి సర్దుబాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇళ్ల పన్ను రాయితీపై ఉత్తర్వులు జారీ
ఒకవేళ ఇప్పటికే పన్ను చెల్లించి ఉంటే వచ్చే ఏడాది సర్దుబాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.15వేల లోపు, ఇతర పట్టణాల్లో రూ.పది వేల లోపు ఇంటిపన్ను చెల్లించే వారికి సగం రాయితీ ఇస్తారు. ఈ రాయితీ మొత్తాన్ని స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది.