పశుసంవర్ధక శాఖలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులపై స్పష్టత వచ్చింది. 25 మంది వెటర్నరీ డాక్టర్లకు సహాయ సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ శాఖ సంచాలకులు డా. వి.లక్ష్మారెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు.
పశుసంవర్ధక శాఖలో పదోన్నతులు - వెటర్నరీ డాక్టర్లకు సహాయ సంచాలకులుగా పదోన్నతి
పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ డాక్టర్లకు సహాయ సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ శాఖ సంచాలకులు డా. వి.లక్ష్మారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం చేపడుతోన్న పథకాలను రైతులకు చేరవేయుటకు కీలకపాత్ర పోషించాలని సూచించారు.

పశుసంవర్ధక శాఖలో పదోన్నతులు
పదోన్నతి పొందిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన ఆయన.. రైతులకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సేవలు అందించాలని కోరారు. శాఖలో ప్రభుత్వం చేపడుతోన్న పథకాలను రైతులకు చేరవేయుటకు కీలకపాత్ర పోషించాలని సూచించారు.
ఇదీ చూడండి :ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి