తెలంగాణ

telangana

ETV Bharat / state

తుదిదశకు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ

తెలంగాణలో ప్రభుత్వ అధికారులకు భారీ ఎత్తున పదోన్నతులు లభించనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ అధ్యక్షతన గల శాఖాపరమైన పదోన్నతుల కమిటీలు సోమవారం ఆమోదం తెలిపాయి. నేడో, రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు.

By

Published : Aug 31, 2021, 2:57 AM IST

తుదిదశకు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ
తుదిదశకు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ

సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ తుదిదశకు చేరుకొంది. వివిధ స్థాయిల్లోని ఉద్యోగుల పదోన్నతుల కోసం శాఖాపరమైన కమిటీల సమావేశాలు పూర్తయ్యాయి. ఆయా ప్యానళ్లకు కమిటీలు ఆమోదం తెలిపాయి. న్యాయపరమైన వివాదాలు ఉన్న వారివి మినహా మిగతా వారందరి పదోన్నతులకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. డీపీసీలు పూర్తి కావడంతో పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని ఉద్యోగులు అర్ధరాత్రి వరకు సచివాలయంలో ఉన్నారు. దాదాపు 130 నుంచి 135 మంది వరకు పదోన్నతులు వస్తాయని భావిస్తున్నారు.

ఇవాళ నెలాఖరు, సెలవు దినం కావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇవాళ ఉత్తర్వులు రాకపోతే పదోన్నతులకు ప్రస్తుత ప్యానెల్ సంవత్సరం ముగుస్తుందని, తద్వారా నష్టపోతామన్న ఆందోళన ఉద్యోగుల్లో ఉంది. అయితే ఇవాళ ఉత్తర్వులు వెలువడతాయని భావిస్తున్నారు. అటు పదోన్నతుల విషయమై రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్‌ ఎదుట నిరసనకు దిగిన కొంత మంది ఉద్యోగులకు మెమోలు జారీ అయినట్లు సమాచారం.

ఇదీ చదవండి:IAS transfer: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్​ల బదిలీలు

ABOUT THE AUTHOR

...view details