తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనెల 27 నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ - సీఎం కేసీఆర్​

minister sabitha indhra reddy
మంత్రి సబితా ఇంద్రారెడ్డి

By

Published : Jan 20, 2023, 7:45 PM IST

Updated : Jan 20, 2023, 8:09 PM IST

19:42 January 20

ఈనెల 27 నుంచి ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సబిత ఆదేశం

ఈనెల 27 నుంచి తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ నెల 27 నుంచి ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి కోరారు. పూర్తి షెడ్యూల్​ వెంటనే విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 20, 2023, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details